Mahaa Daily Exclusive

  పోన్ లో సిమ్ లేకుంటే వాట్పాప్ బంద్…. రేపటి నుండి కేంద్రం కొత్త రూల్స్…..

Share

మహా
మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ఫోన్‌లలో యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరి. ఈ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే, సిమ్ లేకుండా మెసేంజర్ యాప్స్ ఫోన్‌లో పనిచేయవు. గత సంవత్సరం నవంబరులో ఈ నిబంధనలు ప్రకటించినప్పటికీ, వీటిని అమలు చేయడానికి ఆయా సంస్థలకు ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది. గడువు రేపటితో ముగియనున్నందున, ఎల్లుండి నుంచి సిమ్ లేకుంటే ఆయా యాప్స్ ఫోన్‌లో పనిచేయకపోవచ్చు. ఎవరైనా సిమ్ లేకుంటే యాప్స్ ఉపయోగిస్తుంటే కనుక ఆ ఫోన్‌లలో ఈ యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది.