Mahaa Daily Exclusive

  తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Share

హైదరాబాద్, మహా: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం మారుతుందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలోనూ పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.