మహా: :ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తూ, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు:
అప్రమత్తత అవసరం: ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక భద్రతా నిబంధనలను, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.
వార్తలను గమనించండి: కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను, వార్తా మాధ్యమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని రాయబార కార్యాలయం కోరింది.
సాధారణ సేవలు: ఎంబసీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, తదుపరి అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలని స్పష్టం చేసింది.
సహాయం కోసం సంప్రదించండి:
భారతీయులకు ఏదైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ఈ క్రింది మార్గాల ద్వారా ఎంబసీని సంప్రదించవచ్చు:
హెల్ప్‌లైన్ నంబర్: +965 65501946








