Mahaa Daily Exclusive

  ఉద్యోగాలేవి..? జాబ్ క్యాలెండర్ ఎక్కడ..? రాహుల్ గాంధీకి కవిత ప్రశ్నాస్త్రాలు..

Share

హైదరాబాద్, మహా : రాహుల్ గాంధీ తెలంగణ రాషఅట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన అధికారిక ఎక్స్ ఖాతాలో తీవ్ర విమర్శలు చేశారు. “రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో… కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ గారు… మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?” అని ప్రశ్నించారు. “మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు చిదిమేశారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణచివేస్తున్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు. రాహుల్ జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ… 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి” అని కవిత తన ట్వీట్‌లో కోరారు.

Latest