Mahaa Daily Exclusive

  మొట్లగూడెంలో బ్యాంకు అధికారుల విచారణ….

Share

  • మొట్లగూడెంలో బ్యాంకు అధికారుల విచారణ
  • మహా వరుస కథనాలతో అక్రమార్కుల గుండెల్లో గుబులు
  • బకాయిపడ్డ లోన్ తో మాకు సంబంధం లేదని గ్రూప్ సభ్యుల స్టేట్మెంట్
  • అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా డిమాండ్

కారేపల్లి, మహా:మొట్లగూడెం అక్రమంపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉన్నతాధికారులు ఎట్టకేలకు విచారణ చేపట్టారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం ఆఫీస్ డెస్క్ ఆఫీసర్ లింగమల్లు బుధవారం మొట్లగూడెం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఇప్పటికే బ్యాంక్ నుంచి నోటీసులు జారీ చేసిన స్వరాజ్, వినాయక గ్రూప్ కు సంబంధించిన సభ్యులతో మాట్లాడారు.

*లిఖితపూర్వకంగా గ్రూప్ సభ్యుల స్టేట్మెంట్…

స్వరాజ్, వినాయక గ్రూప్ కు సంబంధించిన మొట్లగూడెం గ్రామస్థులు బ్యాంక్ అధికారికి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. స్వరాజ్, వినాయక గ్రూప్ లో గతంలో సభ్యులుగా ఉండి తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించామని మా ప్రమేయం లేకుండా గ్రామానికి సంబంధం లేని మరో ముగ్గురిని సభ్యులుగా చేర్చి అక్రమంగా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

*అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి..
బ్యాంక్ నుంచి స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో అక్రమంగా రుణాలు తీసుకుని బ్యాంకు సొమ్ము కాజేసిన బుక్ కీపర్, గ్రామదీపిక, సీసీ, ఏపీఎం, బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని మొట్లగూడెం గ్రామస్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదును విచారణకు వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారికి అందజేశారు.
*ఐకీపీ అధికారుల తీరు పై అనేక ప్రశ్నలు…

గ్రామంలో లేని వ్యక్తుల పేర్లతో బ్యాంకు లింకేజీ రుణం అక్రమంగా తీసుకుని కాజేశారని బట్టబయలైనప్పటికీ ఐకేపీ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించడం పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమార్కులకు కొందరి ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు లింకేజీ రుణం కోసం సీసీ, ఏపీఎం తప్పని సరి సంతకాలు చేయాలి. ఉత్తుత్తి గ్రూపులకు వీరు ఎలా సంతకాలు చేసి రుణాలు ఇప్పించారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 12 లక్షల రూపాయల బ్యాంకు సొమ్ము కాజేయడానికి పథకం వేసిన వీరందరి పై చీటింగ్ కేసు ఎందుకు నమోదు చేయించలేదో ఐకెపి అధికారులు సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest