Mahaa Daily Exclusive

  ‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్..! తారల తళుకులు .. రాజకీయ ప్రముఖుల మెరుపులు..

Share

హైదరాబాద్, మహా : టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో నూతన దంపతులు విజయ్, రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో రష్మిక ఎరుపు రంగు పట్టు చీరలో మెరిసిపోగా, విజయ్ వైట్ వెష్టి (పంచె), కుర్తాలో ఎంతో హుందాగా కనిపించారు. అతిథులందరికీ విరోష్ టీమ్ సాదరంగా స్వాగతం పలికింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన సతీమణి గీతారెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నూతన దంపతులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున దంపతులు, దగ్గుబాటి వెంకటేశ్, రామ్ చరణ్ దంపతులు, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నవీన్ పొలిశెట్టి, శరత్ కుమార్-రాధిక దంపతులు, నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి హాజరయ్యారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, మాజీ మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దంపతులు, ఎంపీ మల్లురవి వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.

Latest