హైదరాబాద్, మహా : సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను పదేపదే బదిలీ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారు. తరచూ బదిలీలతో పాలన కుంటుపడుతోంది. పరిస్థితులు అర్థం చేసుకునేలోపే అధికారులు బదిలీ అవుతున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కూడా ఇప్పటికే నలుగురు మారారు. కలెక్టర్ల సదస్సులో సీఎం బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సీఎం, మంత్రులకు నచ్చకపోతే అధికారులను వెంటనే బదిలీ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను సీఎం బెదిరిస్తున్నారు. కొందరికి పోస్టింగులు ఇచ్చి కూడా జాయిన్ చేసుకోవడం లేదు. కాంగ్రెస్ నేతల అవినీతి, బినామీలను త్వరలోనే బయటపెడతాం’’ అని హరీశ్‌రావు అన్నారు.
Post Views: 8







