Mahaa Daily Exclusive

  ఈ ఏడాది వేసవి నిప్పుల కొలిమే..! భగభగలాడుతున్న భానుడు..

Share

  • ఈ ఏడాది వేసవి నిప్పుల కొలిమే
  • భగభగలాడుతున్న భానుడు
  • రాష్ట్రంలో పెరిగిన ఎండ తీవ్రత

 

హైదరాబాద్, మహా

 

ఈ ఏడాది అపుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఈ సంవత్సరం అధిక వర్షపాతంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంది కనుక గరిష్ఠ ఉష్ణోగత్రలు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణ తీవ్రత నమోదవుతుందని రాగల రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పెరుగుతాయని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రత కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 33 నుంచి 34 డిగ్రీల వరకు ఎండ తీవ్రత కొనసాగుతోంది. క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే 2 నుంచి మూడు డిగ్రీలు మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు.

…..

Latest