Mahaa Daily Exclusive

  సదాశివపేటలో విజిలెన్స్ దాడులు.. హోటళ్లపై ఆకస్మిక సోదాలు.. 22 గ్యాస్ సిలిండర్లు సీజ్!

Share

 

మహా : సదాశివపేట:
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో పలు హోటళ్లు, బేకరీలు, స్వీట్ హోంలలో సోదాలు చేపట్టారు. 6 ఏ ఇ సి యాక్ట్ ప్రకారం 6 కేసులు నమోదు చేసి, 22 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.
గృహ అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించే సిలిండర్లను వ్యాపారాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసిఎస్ స్వరూప హెచ్చరించారు. సదాశివపేట పట్టణంలో గ్యాస్ కొరత ఏమీ లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్‌మెంట్ బృందం సభ్యులు డి.ఎస్.పి వెంకటేశం, సిఐ పండరి, ఎస్సై సాంబశివ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest