హైదరాబాద్:మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గళాన్ని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలకు మీడియా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు, ఆయా జిల్లాలకు అధికార ప్రతినిధులు మరియు ప్యానెలిస్టులను మీడియా ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నియామకాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు అశోక్ ముస్తాపురేను, హైదరాబాద్ సెంట్రల్ బాధ్యతలను ఎన్వీ సుభాష్‌కు అప్పగించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్‌గా రాణి రుద్రమ్మ, రంగారెడ్డి రూరల్‌కు పోరెడ్డి కిషోర్ రెడ్డి ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా బాధ్యతలను డాక్టర్ రవి కుమార్ గౌడ్, కరీంనగర్ బాధ్యతలను చెన్నమనేని వికాస్ చేపట్టనున్నారు. మేడ్చల్ రూరల్ ఇన్‌ఛార్జ్‌గా రవి కుమార్ యాదవ్, మేడ్చల్ అర్బన్ బాధ్యతలను డాక్టర్ జి. సమతకు కేటాయించారు.
మరికొన్ని కీలక జిల్లాల విషయానికొస్తే, వరంగల్ జిల్లాకు దశమంత్ రెడ్డిని, హన్మకొండకు సుధాకర్ గందేను నియమించారు. ఖమ్మం జిల్లా మీడియా బాధ్యతలను పుల్లా రావు యాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నంబూరి రామలింగేశ్వరరావు పర్యవేక్షించనున్నారు. మెదక్ జిల్లాకు చీకోటి ప్రవీణ్, సంగారెడ్డికి చింతా విఠల్, సిద్దిపేటకు కప్పర ప్రసాద్ రావులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. నల్గొండ జిల్లాకు డాక్టర్ రాహుల్ సరిదేన, సూర్యాపేటకు విజయ సునీత, యాదాద్రి భువనగిరికి తడూరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు దిలీపాచారి, నాగర్‌కర్నూల్‌కు తిరుపతి రెడ్డి, జోగులాంబ గద్వాలకు పాలనాటి వెంకట్ రెడ్డి, వనపర్తికి అఫ్సర్ పాషా, నారాయణపేటకు నాగేంద్ర బాబులను నియమించారు. అలాగే కామారెడ్డికి బి. ఇంద్రసేనా రెడ్డి, జగిత్యాలకు సందీప్ సాయి, నిర్మల్‌కు బొమ్మగోని రాజు ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు యాదగిరి సునీల్ రావు బాధ్యతలు చేపట్టనున్నారు. మీడియా సంబంధిత అంశాల కోసం పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ను సంప్రదించాలని గౌతమ్ రావు సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.








