Mahaa Daily Exclusive

  సీఎం సభను విజయవంతం చెయ్యాలి – ప్రభుత్వ విప్.

Share

  • కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం
  • శ్రేణులకు నేతల దిశా నిర్దేశం

ఆదిలాబాద్ మ‌హా : సోమవారం బజార్ హత్నూర్ మండలం పిప్రి లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు కోరారు. ఆదివారం పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవభవన్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. సభ విజయవంతం నేపథ్యంలో శ్రేణులకు దిశ నిర్దేశం చేసారు. సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి జోడెదుల్లా పనిచేసేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.ప్రజా పాలన సాగిస్తూ ప్రజాభిమానం చూరగొంటున్నారని అన్నారు. అటు ఆదిలాబాద్ అభివృద్ధి కి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చెయ్యాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఆత్మ చైర్మన్ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మహబూబ్ అలీ, జీషాణ్ అలీ,ఇజ్జగిరి సంజయ్, రాషీద్ ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest