రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మహా
తుర్కయంజాల్ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో “డా. పవన్ ఆర్థో కేర్ క్లినిక్” ఏర్పాటుచేయగా, ఈ క్లినిక్‌ను రాష్ట్ర మెడికల్ , హెల్త్ విభాగం చైర్మన్ డా. ఎం. రాజీవ్ ప్రారంభించారు. ఈ క్లినిక్‌ను ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్
డా. పవన్ కుమార్ చందనం (ఎంఎస్ ఆర్థోపెడిక్స్), ప్లాస్టిక్ & రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డా. మధులిక సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.తుర్కయంజాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆర్థోపెడిక్ , ప్లాస్టిక్ సర్జరీ సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రావడం శుభపరిణామమని, ఈ సేవలు తక్కువ ధరల్లో అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు.ప్రజల ఆరోగ్యం తమ బాధ్యత అన్న నిబద్ధతతో, నాణ్యమైన చికిత్సను అందుబాటు ధరల్లో అందిస్తూ ప్రతి ఒక్కరికీ సకాలంలో సేవలు అందించడం తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రతి రోగి బాధను అర్థం చేసుకుని, సానుభూతితో సేవ చేయడం తమ సేవా సిద్ధాంతమని డా. పవన్ కుమార్ చందనం పేర్కొన్నారు.








