Mahaa Daily Exclusive

  ఓటరు జాబితా ప్రక్షాళనతోనే నిజమైన ప్రజాస్వామ్యం.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు..!

Share

  • ‘డిటెక్ట్-డిలీట్-డిపోర్ట్’ నినాదంతో అక్రమ ఓట్ల ఏరివేత.
  • నారీశక్తికి పట్టాభిషేకం.. అంతర్జాతీయ సంక్షోభంలోనూ స్థిరంగా చమురు ధరలు.
  •  మోదీ నాయకత్వమే దేశానికి రక్ష.
  •  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు.

కొండాపూర్,మహా.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మహిళా సాధికారతకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. కొండాపూర్‌లోని శిల్పా పార్క్ అపార్ట్‌మెంట్స్ నివాసితులతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న ఎన్నికల సంస్కరణలు, మహిళా రిజర్వేషన్లు మరియు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన లోతైన విశ్లేషణ చేశారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన ‘నారీశక్తి వందన్ అధినియం’ చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, ఇది 2029 ఎన్నికల నుంచి అమలులోకి వచ్చి రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని సమూలంగా మార్చబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకువచ్చేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై రాంచందర్ రావు ప్రత్యేకంగా వివరించారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడం ద్వారానే నిజమైన ఓటర్లకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2002 తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఈ స్థాయిలో ప్రక్షాళన జరగలేదని, దీనివల్ల ఓటర్ల జాబితాలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. చిరునామాలు మారిన వారు, మరణించిన వారు మరియు డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పాతబస్తీ వంటి ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉండటం మరియు రోహింగ్యాలు అక్రమంగా ఓటర్ ఐడీలు పొందడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని, అందుకే ‘డిటెక్ట్ – డిలీట్ – డిపోర్ట్’ అనే లక్ష్యంతో ఈ ప్రక్రియను సమర్థంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఫార్మ్-6, 7, 8లను వినియోగించుకుని తమ ఓటును సరిచూసుకోవాలని, ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండటం చట్టబద్ధమని ఆయన గుర్తు చేశారు.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని రాంచందర్ రావు కొనియాడారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 17 శాతం నుండి 50 శాతం వరకు పెరిగినప్పటికీ, భారత్‌లో ఆ భారం సామాన్యుడిపై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. బలమైన డిప్లొమాటిక్ సంబంధాల వల్ల దేశం నేడు సురక్షితంగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 500 నుండి 800 ఓట్లు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున, ప్రజలు తమ ఓటర్ నమోదును బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులు, బీజేపీ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest