సదాశివపేట :మహా:
సదాశివపేట మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన జి. హరిచంద్ర ప్రసాద్ ను బిజెపి మండల పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కర్ణం ఆదిత్య ఆధ్వర్యంలో నూతన తహసిల్దార్ ను ఆయన చాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పుష్ప గుచ్చాలు, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ నామ హరీష్ , నాయకులు జగన్నాథ్ రెడ్డి, లక్ష్మణ్, నాగరాజు, సుభాన్, ప్రసాద్, అనిల్ ప్రశాంత్, దుర్గరాజు , శ్రీకాంత్ సాకేత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6







