- విద్యపై సీఎం రేవంత్ ఫోకస్ బాగుంది
- ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి
- అత్యున్నత స్థాయికి వెళ్లిన వారందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన వారే
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు, మహా : రాష్ట్రంలో ప్రభుత్వ నిద్యలో సమూల మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అద్భుతమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చదివి 10వ తరగతిలో ప్రధమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15 వేలు, 10 వేలు, 7500 రూపాయల ప్రోత్సాహకం అందించామని, ఈ విద్యా సంవత్సరానికి ఈ ప్రోత్సాహకాన్ని పెంచుతున్నామన్నారు. ఈసారి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి 25 వేలు, 15 వేలు, 10 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు.
అత్యున్నత స్థాయికి వెళ్ళినవారందరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనని, ప్రభుత్వ పాఠశాలలో చదువు గొప్పగా ఉంటుందని చెప్పారు. మనం మన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తామో సమాజంలో ఉన్న పేద వాళ్ళ గురించి గ్రామం గురించి ప్రాంతం గురించి ఆలోచించినప్పుడే ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందుతాయన్నారు. మా అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద నేను బ్రతికున్నంత వరకు పేదలకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు.
ఉదయ సముద్రం పనులను నిర్లక్ష్యం చేశారు
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు కొట్లాడి మరి తీసుకొచ్చిన ఉదయ సముద్రం బ్రాహ్మణవెళ్లెంల ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆ ప్రాజెక్టును కావాలని పక్కన పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10 శాతం పనులని పూర్తి చేసి భూ సేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పంపులను ఓపెన్ చేశామని గుర్తు చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడినుండి నీటిని తీసుకురావాలనే అంశాన్ని వదిలిపెట్టి కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ రిజర్వాయర్ లు కట్టి వదిలిపెట్టిందన్నారు. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించడానికి 1800 కోట్ల రూపాయలను మంజూరు చేయిస్తే పనులు మొదలయ్యాయన్నారు.. బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని గ్రామాలకు శాశ్వతంగా సాగు, తాగునీరు అందించడానికి భూసేకరణ పనులు జరుగుతున్నాయన్నారు.
నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తున్న
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా నిజాయితీగా పని చేస్తున్నానని, ఇటీవల కొంతమంది స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి, రాజకీయాలు లేనప్పుడు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 31 సబ్ స్టేషన్లు నిర్మాణం అయితే, మా ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ళలోనే 24 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి 132 కెవి సబ్ స్టేషన్ లు మూడు ఉండగా, మరో మూడు 132 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేయించానన్నారు. రాబోయే 25, 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మునుగోడు నియోజకవర్గంలో లో వోల్టిజి సమస్య లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.







