Mahaa Daily Exclusive

  9 వర్సిటీలకు వీసీల నియామకం..!

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. విద్యా కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా, శుక్రవారం ముగ్గురు సభ్యులుగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చెరగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలను కేటాయించింది. వీరు త్వరలోనే బాధ్యతలు తీసుకోనున్నారు.

రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్(వీసీ)లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం వీసీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 1380పైగా దరఖాస్తులు రావడంతో అర్హుల ఎంపిక బాధ్యతను విద్యాశాఖ సెర్చ్ కమిటీలకు అప్పగించింది.

 

దరఖాస్తులు పరిశీలించిన సెర్చ్ కమిటీ.. ఒక జాబితాను ఇటీవల గవర్నర్‌కు పంపింది. ప్రభుత్వం పంపిన జాబితాకు ఆమోదం తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

వీసీల వివరాలు:

 

కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి

పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్

శాతవాహన వర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్

తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు

మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావు

జయశంకర్ వర్సిటీ వీసీగా జానయ్య

శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ వీసీగా రాజిరెడ్డి నియమితులయ్యారు.