మహా వరంగల్ బ్యూరో :
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో జర్నలిస్టులుగా పనిచేసే అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అన్నారు. సోమవారం హనుమకొండ రాంనగర్ లోని ఆయన నివాసంలో కొండా మురళీధర్ రావును జర్నలిస్ట్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం దేశాయిపేట లో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన జర్నలిస్టులందరికీ ఇవ్వాలని కొండా మురళీధర్ రావు ను జర్నలిస్ట్ ప్రతినిధులు కోరగా ఈ విషయం పై స్పందించిన ఆయన అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని, సీనియారిటీ ఆధారంగానే ఇస్తామని ఆయన వెల్లడించారు.
అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్య ఏవిధంగా ఉందో అంతే పారదర్శకంగా పనిచేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వార్త కథనాల రూపంలో ప్రజలకు చేరవేసేందుకు జర్నలిస్టులు కూడా తమ వంతు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కొంత జాప్యం అయినప్పటికీ అతి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులు కోరుకొప్పుల నరేందర్, జక్కు విజయ్, కందుల శ్రీధర్, జన్ను స్వామి, విజయన్, హరీష్, బాలాజీ నాయక్, తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.








