Mahaa Daily Exclusive

  దామరపల్లి నర్సింహారెడ్డి రచించిన పాటల సిడిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

Share

 

కుషాయిగూడ, మహా : పశు సంపద తగ్గిపాయె ఆ పశువులన్నీ కనుమరుగాయే.. పశు గ్రాసం లేక తెలంగాణ పల్లెలన్నీ మోడు బారెనో.. అనే పాటల సీడీని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.. మంగళవారం కుషాయిగూడ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నివాసంలో పాటల సిడి ఆవిష్కరణ జరిగింది.. రచయిత దామరపల్లి నర్సింహారెడ్డి రచించిన పశు సంపద కరిగిపాయనో పశు గ్రాసం లేక పల్లెలన్నీ మోడు బారెనో. గానం ఆపూర్వ.సంగీతం స్వర కల్పన, ఎడిటింగ్ దండేపల్లి శ్రీను, కామెర, నిర్మాత జక్క రోషిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో పశు సంపద ఘననీయంగా తగ్గిందని, పశు సంపద లేకపోవడం వ్యవసాయ రంగానికి పాడి రంగానికి అత్యంత ప్రమాదం పొంచి ఉందని, ఎండు పశుగ్రాసం లేక పశువులన్నీ కబేలాలకు తరలిపోతున్నాయని, వచ్చే తరాలకు పశు సంపద ఎలా ఉంటదో తెలియకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కుటుంబం పశువును పెంచుకొని భావితరాలకు దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు నేడు పశు సంపద పశువుల పేడ లేకపోవడంతో వ్యవసాయ భూముల్లో విష రసాయనాలు చల్లడం వల్ల విషపు, భూములై మనల్ని తరిమి వేస్తున్నాయని ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోగం బారిన పడి, తనువును చాలి స్తున్నారని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు. పశుసంపద లేకపోవడం వల్ల, యంత్రాలు వచ్చి పశువులు లేకుండా పశువులు లేకుండా చేశాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మాట్లాడుతూ, పశు సంపదపై ప్రభుత్వాలు చిత్త శుద్ధితో వ్యవహరించాలని, పశువులను పరిరక్షిస్తే అవి మనల్ని పరిరక్షిస్తాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కాసం మహిపాల్ రెడ్డి, కుమారస్వామి షేర్ మనమ్మ, గంప కృష్ణ గుప్తా, మురళి పంతులు, బొమ్మ అమరేందర్ చింతల విజయ్ కుమార్, జింక రఘు, చిలుకూరి అఖిలేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.