Mahaa Daily Exclusive

  ఓటరు జాబితా సవరణలో 87.66% పంపిణీ పూర్తి..! డిజిటైజేషన్ మాత్రం 5.62 శాతమే..!

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. ఆదివారం నాటికి విడుదలైన రాష్ట్రవ్యాప్త ప్రత్యేక సమగ్ర సవరణ నివేదిక ప్రకారం, మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,96,52,618 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, ఇది 87.66 శాతం పూర్తయినట్లు వెల్లడైంది. అయితే, పంపిణీ చేసిన ఫారాల్లో ఇప్పటివరకు 19,02,648 ఫారాలు మాత్రమే డిజిటైజ్ చేయగలిగారు. ఇది మొత్తం ఓటర్లలో 5.62 శాతం మాత్రమే కావడం గమనార్హం.

 

పంపిణీలో పలు జిల్లాలు దాదాపు పూర్తి

 

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పలు జిల్లాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నిర్మల్ (99.92%), జోగులాంబ గద్వాల్ (99.87%), వనపర్తి (99.74%), నల్గొండ (99.12%), జయశంకర్ భూపాలపల్లి (99.19%), ఖమ్మం (99.23%), భద్రాద్రి కొత్తగూడెం (99.02%), నాగర్‌కర్నూల్ (98.99%), మహబూబాబాద్ (98.97%), సిద్దిపేట (98.58%), మహబూబ్‌నగర్ (98.90%), యాదాద్రి భువనగిరి (98.19%), జంగాం (98.79%), మెదక్ (94.07%), కామారెడ్డి (93.36%), వికారాబాద్ (92.64%) జిల్లాలు అత్యధిక పురోగతి నమోదు చేశాయి.

 

నగర జిల్లాల్లో నెమ్మదించిన ప్రక్రియ

 

మరోవైపు నగర పరిధిలోని జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆశించిన వేగంతో సాగడం లేదు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కేవలం 61.57 శాతం, హైదరాబాద్ జిల్లాలో 65.91 శాతం, రంగారెడ్డి జిల్లాలో 81.08 శాతం, సంగారెడ్డి జిల్లాలో 89.40 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. జనాభా అధికంగా ఉండటం, పట్టణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలు ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు.

 

డిజిటైజేషన్‌లో యాదాద్రి అగ్రస్థానం

 

ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా 28.32 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కుమురం భీం ఆసిఫాబాద్ 22.35 శాతం, నల్గొండ 17.73 శాతం, ఖమ్మం 15.55 శాతం, జయశంకర్ భూపాలపల్లి 13.09 శాతం, నిజామాబాద్ 11.61 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

మేడ్చల్‌లో అత్యల్ప డిజిటైజేషన్

 

డిజిటైజేషన్ ప్రక్రియలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కేవలం 0.86 శాతంతో రాష్ట్రంలో చివరి స్థానంలో ఉంది. అలాగే వికారాబాద్ (1.67%), రంగారెడ్డి (1.82%), సంగారెడ్డి (2.10%), హైదరాబాద్ (2.49%), నాగర్‌కర్నూల్ (2.49%), హనుమకొండ (3.00%), భద్రాద్రి (3.20%), వరంగల్ (3.72%), కరీంనగర్ (3.99%), మంచిర్యాల (4.03%) జిల్లాల్లో కూడా డిజిటైజేషన్ పురోగతి చాలా తక్కువగా నమోదైంది.

 

జిల్లాల వారీగా అసమాన పురోగతి

 

ఆదిలాబాద్ (98.40%), జగిత్యాల (97.64%), పెద్దపల్లి (94.36%), రాజన్న సిరిసిల్ల (99.31%), సూర్యాపేట (97.36%), నారాయణపేట (95.09%), ములుగు (98.45%) వంటి జిల్లాల్లో పంపిణీ వేగంగా జరిగినప్పటికీ, డిజిటైజేషన్ మాత్రం 5 నుంచి 8 శాతం మధ్యే ఉండడం కనిపిస్తోంది. దీంతో ఫారాల పంపిణీ పూర్తవుతున్నా, డేటా నమోదు ప్రక్రియలో ఇంకా గణనీయమైన పురోగతి అవసరమని స్పష్టమవుతోంది.

Latest