ఆదిలాబాద్ మహా : తెలంగాణలో ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసి మాట నిలబెట్టుకుందని ఆదిలాబాద్ కాంగ్రెప్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసారు. సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని అన్నారు. రైతులకు భరోసా నిస్తూ పెట్టుబడి సాయం అందించిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12వేల రూపాయల రైతు భరోసా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విఠల్,దాసరి ఆశన్న, ఎంఏ షకీల్, గడ్డం జగదీష్ రెడ్డి,విఠల్, తదితరులు పాల్గొన్నారు.








