- ఓటర్లకు అవగాహన కల్పించిన ఎమ్మార్వో, మాజీ కార్పొరేటర్
వరంగల్, బ్యూరో మహా ;
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ ఐ ఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వరంగల్ మండల ఎమ్మార్వో టీ శ్రీకాంత్ తో పాటు మాజీ కార్పొరేటర్ బాలీన సురేష్ ఫీల్డ్ లోకి దిగి ఎస్ఐ ఆర్ పై ప్రజల్లో చైతన్యం కలిగించారు. మండల కేంద్రంలోని 26వ డివిజన్ లోని పలు కాలనీ ల్లో ఎమ్మార్వో టి. శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సురేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గురించి వివరించారు.
పేరు నమోదు, తొలగింపు, సవరణకు అవకాశం
ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత పేర్లు నమోదు చేసుకోవాలని, చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, చిరునామా మారిన వారు సవరణ చేసుకోవాలని సూచించారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఫారాలను అందజేస్తారని, మీ దగ్గరలో ఉన్న ఎస్ఐఆర్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా మండల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, బీఎల్ఓ లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.







