- సంక్రాంతి తర్వాత రైతు ఖాతాల్లో భరోసా డబ్బులు
- గుజరాత్ గులాం కిషన్ రెడ్డి
- రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేశారు
- వడ్డీలకే నెలకు రూ. 6500 కోట్లు కడుతున్నాం
- గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులపై భారం
- రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత
- సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రైతు భరోసాను కొనసాగిస్తామని అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వేస్తామన్నారు. రైతు భరోసాపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశామని, అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పులమయంగా చేశారన్నారు. ఏడాదిలోనే రూ. 20వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు. సన్నాలకు రూ. 500బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులామని విమర్శించారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని మరోసారి సీఎం సవాల్ విసిరారు.
రాష్ట్రంపై రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీకే కట్టాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి గతంలో ఎవరూ బయటపెట్టలేదని చెప్పారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొదని, ఇచ్చిన గ్యారెంటీలను అధైర్యపడకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. 2023 వానాకాలంలో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చి తీరుతామని, తాము అధికారంలోకి రాగానే రూ. రూ. 7625 కోట్లు రైతుబంధు నిధులు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్నారు. నెహ్రూ నుంచి వైఎస్సార్ దాకా రైతులే మా ఎజెండా అన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును మేం చెల్లించామన్నారు. అధికారంలోకి రాగానే రూ. 7,625 కోట్ల రైతుబంధు నిధులు చెల్లించామని, ఆగస్టు 15నాటికి 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఆగస్టు 15నాటికి రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేయడం జరిగిందని, నిన్న (శనివారం) 3.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,747 కోట్లు వేశామన్నారు. ఇప్పటి వరకు 25.35 లక్షలమంది రైతుల ఖాతాల్లో.. రూ.21వేల కోట్లు జమ చేశామని, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ రైతులను మోసం చేసింది కాబట్టి మమ్మల్ని కూడా అలా అనే ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లున్నారన్నారు.
రూ.2 లక్షల వరకు ఉన్న అందరికీ రుణమాఫీ పూర్తయిందన్నారు. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేయడం జరిగిందని, ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామనని సీఎం స్పష్టం ఛేశారు. ఖాతాల్లో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుందని, రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామని, మొదట్లో బ్యాంకు అధికారులు రుణమాఫీపై సరైన సమాచారం ఇవ్వలేదు, . బ్యాంకుల్లోని మొత్తం పాతబకాయిలు కలిపి రూ.30 వేల కోట్లుగా లెక్క చెప్పారన్నారు. ఏది ఏమైనా రైతులను అన్ని ఱకాలుగా ఆదుకుని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి ఆదుకుంటామని, ఇందులో ఎవరెన్ని ప్రచారాలు చేసినా నమ్మోద్దని ణరోసారి రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.







