హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్ గదిలో సోదాలు నిర్వహించి డ్రగ్స్ సీజ్ చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తితో పాటుగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ కొరియోగ్రాఫర్ సైతం ఉన్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.4.18 లక్షల విలువైన ఎండీఎంఏ, సీజ్ చేశారు.
ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూసాపేటలో నివాసం ఉంటున్నాడు. అతడికి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్గా చేస్తున్న యువకుడు(24),తో పాటు చందానగర్కు చెందిన ఓ ప్రముఖ అర్కిటెక్చర్, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువతి పరిచయం అయ్యారు. దీంతో ఈ నలుగురు కలిసి మదాపూర్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు
వారి వద్ద ఉన్న డ్రగ్స్ సీజ్ చేయటంతో పాటు.. 6 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






