Mahaa Daily Exclusive

  ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఐక్యతకు ప్రతీక బతుకమ్మ…

Share

  • మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..
  • పూల పండుగ బతుకమ్మ.. ఇంటింటా సంతోషాలతో ఉండాలి..
  • ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి…

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 మహా:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగ బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాలు, సౌభాగ్యాలు నింపాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన తెలిపారు.