Mahaa Daily Exclusive

  కారేపల్లి మండలం గాదేపాడులో విషాదం

Share

  •  రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

కారేపల్లి, మహా :కారేపల్లి మండలం గాదేపాడు గ్రామానికి చెందిన మద్యబోయిన వెంకటేష్ (40), ఆయన భార్య రమ్య (36) ఆదివారం రాత్రి ఇల్లందు–ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వెంకటేష్ ఆటో నడుపుతూ, రమ్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో గాదేపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.