- 12 మంది మహిళలు.. 10 మంది పురుషులు.
- టీజీపీఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు.
హైదరాబాద్, మహా:
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా 22 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో 12 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. మొత్తం 118 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 మందిని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కేటగిరీలవారీగా కటాఫ్ మార్కులను కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకోవాలని బోర్డు సూచించింది. ప్రస్తుత ఎంపికను తుది నియామకంగా పరిగణించరాదని బోర్డు స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉన్న అభ్యర్థులు 040-4189515 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచించింది.








