Mahaa Daily Exclusive

  దైవ సన్నిధిలో దరిద్రులు

Share

  • అత్యున్నత పవిత్ర స్థలంలో పైశాచిక వేషాలు
  • మరణశిక్ష దండన వేసిన ప్రభుత్వం
  • బంగ్లాదేశ్ జంటకు సౌదీ అరేబియాలో మరణశిక్ష
  • మక్కాలో ‘అశ్లీల చర్యల’కు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్ష

మహా : మక్కా నగరంలో అశ్లీల చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పురుషుడు, మహిళకు మరణశిక్ష అమలుచేసినట్టు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మక్కాలోని ఒక మసీదులో నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితీ అఖ్తర్ ‘అశ్లీల చర్యలకు’ పాల్పడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్టు సౌదీ అరేబియా ప్రభుత్వ వార్తా సంస్థ, సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్‌పీఏ) పేర్కొంది.

భద్రతా అధికారులు వారిద్దరినీ అరెస్టు చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచినట్టు ఒక సౌదీ అధికారి తెలిపారు. నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితీ అఖ్తర్‌లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ఇద్దరికీ ఉరిశిక్ష అమలుచేసే ముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించాలని సౌదీ అధికారులను కాన్సులేట్ కోరింది.

మంత్రిత్వ శాఖ దీనిపై ముందుగా సమాచారం ఇవ్వలేదు” అని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారి ఒకరు ‘ది డైలీ స్టార్’ పత్రికకు తెలిపారు. “ఈ విషయంపై మేం సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒక అధికారిక దౌత్య లేఖను పంపి ఘటనను అధికారికంగా ధ్రువీకరించాలని కోరాం” అని ఆ అధికారి చెప్పారు.