- వరంగల్ సబ్ డివిజన్లో మెగా రక్తదాన శిబిరం
- రక్తదాతలుగా నిలిచిన పోలీసులు, మాజీ కార్పొరేటర్, జర్నలిస్టులు
ఎంజీఎం, మహా;
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం మంగళవారం వరంగల్ డివిజన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ , క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది, మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు, చిప్ప వెంకటేశ్వర్లు, సీనియర్ పత్రికా విలేఖరి చిన్నబాబు, తో పాటు స్థానిక యువకులు, ప్రజాపతినిధులు పాల్గొని రక్త దాతలుగా నిలిచారు.








