- సీనియర్ సైంటిస్ట్ బీవీ సుబ్బారావు
హైదరాబాద్, మహా
కాళేశ్వరం ప్రాజెక్టు సైతం భూకంపానికి కారణంగా సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేయటం వల్ల ఒత్తడి పెరిగి ఇటువంటివి జరుగుతాయని అంటున్నారు. డిజాస్టర్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకూడదని.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం మెుత్తం డిజాస్టర్‌కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సైతం వెల్లడించిందని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమిలో నీరు బాగా పెరిగిందన్నారు. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో.. భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని అన్నారు. వీటి ద్వారా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. భూకంపకేంద్రంగా చెబుతున్న ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 31న టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగి అరణ్యంలో సుమారు 60 వేల చెట్లు కూలిపోయాయి. ఇదే ప్రాంతం కేంద్రంగా ఇప్పుడు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. సైంటిస్టు సుబ్బారావు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడివన్నీ చర్చనీయాంశంగా మారాయి.








