మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఖైరతాబాద్ నియోజకవర్గం ఆనంద్ నగర్ కాలనీ వయోపౌరుల సంఘాన్ని కలిసి, అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR )గారు పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా MGR గారు మాట్లాడుతూ.. వయోపౌరులు సమాజానికి ఎంతో విలువైన మార్గదర్శకులని, వారి అనుభవం, సూచనలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. పట్టభద్రుల హక్కులను కాపాడటంలో ప్రతి ఓటు కీలకమని, ఓటరు నమోదు ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వయోపౌరుల సంఘం సెక్రటరీ ప్రభాకరం మరియు రామ ప్రభాకర్ రెడ్డి, విష్ణు, బిట్ల శ్రీనివాస్ రాజు, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







