Mahaa Daily Exclusive

  తుపాన్ వేళ …ఏపీలో రైతులకు పంటల బీమా భరోసా

Share

  • తుపాన్ వేళ
  • ఏపీలో రైతులకు పంటల బీమా భరోసా
  • రూ.15,969 కోట్ల కవరేజీ!

అమరావతి, మహా : అకాల వర్షాలు, తుఫాన్ లతో పంట నష్టాల ముప్పు పొంచి ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంటల బీమా భరోసా కల్పించారు. 2026 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 22 రకాల పంటలకు బీమా కవరేజీ కల్పిస్తున్నారు. మొత్తం 17.12 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణానికి రూ.15,969 కోట్లకుపైగా బీమా రక్షణ అందించనున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఈ పథకాలు అండగా నిలవనున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 4.10 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు బీమా పరిహారం అందించేందుకు పంటల బీమా పథకాలు కీలకంగా మారాయి. ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ పంటలకు బీమా రక్షణ కల్పించడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.

ఫసల్‌ బీమా కింద 15 పంటలకు కవరేజీ

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రాష్ట్రంలో 15 రకాల పంటలకు బీమా కవరేజీ కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.10,534 కోట్ల విలువైన బీమా రక్షణ అందుబాటులోకి రానుంది. మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 22 రకాల పంటలకు బీమా కల్పించడంతో రైతులకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్థికంగా అండ లభించనుంది.