బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు సంఘీభావంగా జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో అభ్యర్థుల నిరసన మద్దతు తెలుపుతూ ఆయన దీక్ష చేపట్టారు. అయితే, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన వాహనం ఆ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. రూ. కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్, బెడ్ రూమ్, ఏసీతో సహా అన్ని సౌకర్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ దీక్షపై నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 51






