Mahaa Daily Exclusive

  కుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్

Share

మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు తెలిపారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభ మేళ నేపథ్యంలో సెక్టార్ 6 లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని కుంభమేళాలో నిర్మిస్తున్నామన్నారు. తిరుమలతరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు చేపడుతామన్నారు. మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగానే కార్యాచరణ సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు.

Latest