Mahaa Daily Exclusive

  సందడే సందడి సంక్రాంతికి ఏడు రోజులు సెలవులు

Share

హైదరాబాద్, మహా : సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడపేందుకు సిద్ధం అవుతున్నారు. వారం రోజుల క్రితం క్రిస్మస్‌, బాక్సింగ్‌ డే, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణంతో డిసెంబరు నెల 25, 26, 27 ఇలా వరుసగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 1వ తేదీన ప్రభుత్వం పబ్లిక్‌ హాలిడే ప్రకటించింది. ఇలా గత డిసెంబర్​లో వరుస సెలవుల నుంచి తేరుకునేలోపు వెంటనే సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తెగ ఖుషీ అవుతున్నారు.

Latest