Mahaa Daily Exclusive

  హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదుల వెల్లువ‌…!

Share

బుద్ధ‌భ‌వ‌న్‌లోని హైడ్రా కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జావాణికి ఫిర్యాదులు వెళ్ళువలా వచ్చాయి. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ప్ర‌జావాణిలో భాగంగా సోమ‌వారం మొద‌టి రోజు 83 ఫిర్యాదులు వచ్చాయి హైడ్రా కార్యాల‌యంలో 11 గంట‌లకు మొద‌లై రాత్రి వ‌ర‌కూ ఫిర్యాదులను నేరుగా స్వీక‌రించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్. హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చిన ఫిర్యాదుదారుల‌కు టోకెన్లు అంద‌జేసి.. విజిటింగ్ రూంలో కూర్చోబెట్టి ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌.
స‌మ‌స్య ఏమిటి..? ఏ ప్రాంతానిది..? పూర్తి వివ‌రాలు తెలుసుకుని అప్ప‌టిక‌ప్పుడే స్థానిక అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్యను వివ‌రించి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలని కోరిన కమిషనర్. ఔట‌ర్ రింగ్గురోడ్డు ప‌రిధి దాటి ఇత‌ర జిల్లాల నుంచి కూడా వ‌చ్చిన ఫిర్యాదుదారుల‌కు.. త‌మ ప‌రిధిలో లేద‌ని న‌చ్చ‌జెప్పి వెన‌క్కి పంపించిన రంగ‌నాథ్‌. హైడ్రా ప‌రిధిలోని ఫిర్యాదులే కాకుండా.. ఇత‌ర శాఖ‌ల‌కుచెందిన స‌మ‌స్య‌ల‌పై కూడా ఫిర్యాదులు. వాటిని ఆయా శాఖాధిప‌తుల‌కు అంద‌జేయాలంటూ క‌మిష‌న‌ర్ సూచ‌న‌. ప్ర‌తి ఫిర్యాదుపై హైడ్రా కార్యాల‌యంలో అధికారుల‌తో చ‌ర్చించి.. ఆయా ఫిర్యాదులు ఎవ‌రి ప‌రిధిలో ఉంటే వారికి అంద‌జేసి.. వారం రోజుల్లో పూర్తి నివేదిక కావాలంటూ ఆదేశాలు. సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదులు కేటాయించి వారితో ఫాలోఆప్ చేయాలంటూ ఫిర్యాదుదారుల‌కు సూచ‌న‌లు. 3 వారాల్లో మీ ఫిర్యాదుపై స్పంద‌న ఉంటుందంటూ హామీ.

నేరుగా హైడ్రా అధికారులు ఫిర్యాదును క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తారంటూ హామీ ఇచ్చిన రంగ‌నాథ్‌. సామాన్యుల నుంచి ప్ర‌భుత్వ, పోలీసు ఉద్యోగులు, ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధులు ఇలా అన్ని వ‌ర్గాల నుంచి హైడ్రా క‌మిష‌న‌ర్ కు ‌ఫిర్యాదులు. చెరువులు, పార్కులు, ర‌హ‌దారుల క‌బ్జాపై వెల్లువెత్తిన ఫిర్యాదులు. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కొంత‌మంది స్థానికులు కాజేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఆధారిత ప‌త్రాల‌తో ఫిర్యాదు చేసిన ప్ర‌జ‌లు. పాత లే ఔట్ల‌ను ప‌క్క‌న పెట్టి.. ఫోర్జ‌రీ లే ఔట్ల‌తో పార్కుల‌ను, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాజేసిన క‌బ్జాదారుల‌పై క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు. త‌న‌కు ప్ర‌భుత్వం కేటాయించిన ఇంటి స్థ‌లంతో పాటు.. పార్కు స్థ‌లాన్ని కూడా స్థానికంగా ఉన్న ఓ మ‌హిళ కాజేసింద‌ని.. స్థానిక‌ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌లేద‌ని 1971లో ఇండో పాక్ వార్‌లో నేరుగా పాల్గొన్న విశ్రాంత సైనికుడు పి. సీతారామ‌రాజు ఫిర్యాదు. జవ‌హార్‌న‌గ‌ర్‌లో ప్ర‌భుత్వ భూమిని నోట‌రీ చేసి అమ్మేస్తున్నార‌ని.. మొత్తం 6 వేల ఎక‌రాల‌కు గాను 2500 ఎక‌రాలు మాత్ర‌మే మిగిలి ఉంద‌ని.. దీనిని కూడా ప్లాట్లు చేసి అక్ర‌మ లే ఔట్‌తో అమ్మేస్తున్నార‌ని.. తాజాగా 15 ఎక‌రాల స్థ‌లాన్ని స్థానికంగా ఉన్న వ్య‌క్తి కాజేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ముఖేష్‌కుమార్ అనే వ్య‌క్తి ఫిర్యాదు.ఇరిగేష‌న్ నాలాకు ఆనుకుని ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాన్ని 60 గ‌జాల ప్లాట్లు చేసి అమ్మేస్తున్నార‌ని.. వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరే లోత‌ట్టు ప్రాంతంలో పేద‌వారు ఇల్లు కొనుక్కొని మోస‌పోతున్నార‌ని.. వెంట‌నే ఆపాలంటూ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం చిల‌కాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ భ‌ర్త ప్ర‌వీణ్ ముదిరాజ్ హైడ్రా క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. మియాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని బ‌క్షికుంట‌, రేగుల కుంటల‌ను సుంద‌రీక‌రిస్తే ఆయా చెరువుల్లోకి మురుగు నీటిని వ‌దిలేస్తున్నార‌ని చందాన‌గ‌ర్‌కు చెందిన ప్ర‌జా సంఘాల నాయ‌కులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. అక్క‌డ ఉన్న గేటెడ్ క‌మ్యూనిటీకి చెందిన వారు ఎస్‌టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌) ద్వ‌రా మురుగును శుభ్రం చేయ‌కుండానేరుగా చెరువులోకి వ‌దిలేయ‌డంతో రూ. కోట్లు ఖ‌ర్చు చేసి కాపాడిన చెరువు మ‌ళ్లీ దుర్గంధంగా మారుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. వ‌ర‌ద కాలువ‌లు కూడా క‌బ్జా అవుతున్న‌యంటూ చందాన‌గ‌ర్‌వాసుల ఫిర్యాదు

Latest