Mahaa Daily Exclusive

  KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే!

Share

ఫార్ములా ఈ-రేసు వ్యవహారం కేసులో విచారణకు వచ్చినట్లే వచ్చిన కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్ళకుండజానే వెళ్ళిపోయారు. ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం సోమవారం న్యాయవాదులతో కలిసి కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదితో వస్తున్న కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాన ద్వారం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీబీ కార్యాలయంలోకి నికి న్యాయవాదికి అనుమతి లేదని బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి కేటీఆర్‌కు స్పష్టం చేశారు. న్యాయవాది అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. తన వాదనను ఇప్పటికే హైకోర్టుకు వెల్లడించామని కేటీఆర్ తెలిపారు. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసిందని ఏసీబీ అధికారులకు కేటీఆర్‌ వివరించారు.

హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతోనే ఏసీబీ ఆఫీస్‌కు వచ్చానని, న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కు అని వివరించారు. న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలని కానీ పోలీసులు ఎందుకు చెబుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. అసలు పోలీసులకు ఇక్కడేం పని అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేటీఆర్ మధ్య వాదన జరిగింది. కోర్టు అరెస్టు చేయోద్దని ఆదేశాలిస్తూనే విచారణ చేయాలని పేర్కొందని పోలీసులు చెప్పగా, న్యాయవాదితో ఏసీబీ కార్యాలయానికి వెళ్ళొద్దని చెప్పలేదని కేటీఆర్ వాదించారు. ఒక వేళ కోర్టు ఆదేశాలు న్యాయవాదితో ఏసీబీ కార్యాలయానికి రావొద్దని ఉంటే చూపించాలని కేటీఆర్ అడిగారు. నేను విచారణకు సిద్దంగా ఉన్నా, ఏసీబీ ఏం అడుగుతుందో నాకు తెలుసు, తర్వాత ఏసీబీ ఏం స్టేట్ మెంట్ రాస్తుందో కూడా తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లేని కేసును తనపై బలవంతంగా రుద్ది ఇప్పుడేదో లాజిక్ పాయింట్లతో ఇబ్బందులకు గురి చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నాకసలు పోలీసులపై విశ్వాసం లేదని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏసీబీ విచారణలో ఏం చెబుతానో ఇప్పుడు కూడా బహిరంగంగా అదే చెబుతానని కేటీఆర్ అన్నారు. కొడంగల్ కేసీలో మాజీ ఎమ్మెల్యేపట్నం నరేంద్ర రెడ్డిని తప్పుడు స్టేట్ మెంట్ లో ఇరికించి జైలుకు పంపించారని, ఇప్పుడు థనపై కూడా అలాగే వ్వహగరించరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. ఏసీబీ కార్యాలయంలోకి న్యాయవాదులతోనే వెళ్తా లేదంటే వెనక్కు వెళ్ళిపోతా కోర్టులోనే ఈ విషయం తేల్చుకుంటా అని కేటీఆర్ ప్రధాన ద్వారం వద్ద కారులోనే కూర్చుండి పోయారు. చేసేది లేక పోలీసులు న్యాయవాదులతో లోనికి పంపించేది లేదు, మీ ఇష్ట ప్రకారం నడుచుకోండని తేల్చి చెప్పడంతో కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్ కు వెళ్ళిపోయారు. అప్పటి వరకు కేటీఆర్ విచారణకు వస్తారన్న ఉద్దేశ్యంతో ఉన్న ఏసీబీ దర్యాప్తు బృందం కేటీఆర్ గైర్హాజరుపై ఉన్నతాధికారులకు శమాచారం ఇచ్చారు.

మరోసారి నోటీసులు, లీగల్ టీంకు నో పర్మిషన్

విచారణకు వచ్చినట్లే వచ్చి తిరిగి వెళ్ళిపోయిన కేటీఆర్ ను తిరిగి విచారించేందుకు సన్నద్దమైన ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి ఓరియన్‌ విల్లాలో ఉన్నకేటీఆర్‌ను కలిసిన ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 9 న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజా నోటీసులలో లీగల్ టీంను కానీ, వ్యక్తిగత న్యాయవాదిని కానీ ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించేది లేదని ఏసీబీ స్పష్టం పేర్కొంది.

క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు ఇటీవలే ముగిశాయి. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు సోమవారం జరిగిన పరిణామాలను కోర్టుకు తెలియజేసే అవకాశాలున్నాయి. ఏసీబీ తాజాగా జారీ చేసిన నోటీసులపై కూడా కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.

ఈడీ విచారణకు గడువు కోరినకేటీఆర్‌

కేటీఆర్‌ ఈడీ ముందు నేడు హాజరు కావాల్సి ఉంది. కాగా ఏసీబీ కేసులో హైకోర్టు రేపు తీర్పును వెలువరించనున్న దృష్ట్యా కేటీఆర్‌ ఈడీని మరింత సమయం కోరారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కేటీఆర్‌ సమాధానం పంపారు. అటు ఈడీ విచారణకు హాజరు కాకుండా, ఇటు ఏసీబీ విచారణకు న్యాయవాదులను అనుమతించలేదన్న సాకుతో వెళ్ళకుండా కేటీఆర్ వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Latest