చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణకు మరిన్ని రైల్వే ప్రాజెక్టులను అనుమతించాలని కోరారు. బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉందని, ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందని, రీజనల్ రైల్ అవసరం కూడా ఉందన్నారు. రైల్ రింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణ త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నామని, ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందన్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. 1 ట్రిలియన్ ఎకానమి కాంట్రిబ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.





