తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనలో భక్తులు మృతిచెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ జగన్ ఆకాంక్షించారు.
Post Views: 59





