గంజాయి వంటి మత్తు పదార్థాలతో యువత భవిష్యత్ నాశనమవుతుందని ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ములుగులోని బండారుపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయా అని పరిశీలించారు. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి సరఫరా చేసినా, నిలువ ఉంచుకున్నా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువకులు మంచి అలవట్లవైపు దృష్టి సారించాలన్నారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Post Views: 48








