మదార్స సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు తులేకలాన్ గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో మదార్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం దర్గా ఉర్సు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఉత్సవాల్లో మతాలకు, కులాలకు అతీతంగా ప్రజలు పాల్గొని అల్లా ఆశీర్వాదం పొందడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ఉత్సవాల సందర్భంగా పండగ వాతావరణం నెలకొందని సంతోషం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రామంలోని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నారెడ్డి కిషన్ కిషన్ రెడ్డి, బోడ మహేందర్, వెంకటరెడ్డి, దాసు, యాదయ్య, రాములు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పోల్గొన్నారు.








