Mahaa Daily Exclusive

  ఫార్మసిటీ భూ నిర్వాసితులకు ఇంటి స్థలాలు అభ్యంతరాల స్వీకరణ ఆర్డీఓ అనంతరెడ్డి….!

Share

ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇంటి స్థలాల పట్టాలు అందించనున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పరిధి యాచారం మండలంలోని కుర్మిద్ద, నానక్ నగర్, మేడిపల్లి, తాడిపర్తి గ్రామాలలో ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయనున్నట్లుగా, ఆ గ్రామాల ప్రజలకు ఆర్డీవో అనంతరెడ్డి తెలియజేశారు. ఇట్టి వివరాలను గ్రామ పంచాయతీలో నోటీసు బోర్డుపై ప్రచురించడం జరిగిందని, ఇట్టి విషయంపై ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత మండల కార్యాలయంలో కానీ, ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వగలరని సూచించారు. తదుపరి ఇట్టి దరఖాస్తులు పరిశీలించిన పిదప త్వరలోనే ఇంటి స్థలాలను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి అందించడం జరుగుతున్నదని ఆర్డీవో తెలిపారు.