తెలంగాణ మహిళా కమిషన్ కు వేణుస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పిన వేణు స్వామి. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారన్న జ్యోతిష్యుడు. వేణుస్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు. దీనిపై వేణు స్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన వేణు స్వామికి అక్కడా చుక్కెదురైంది. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన హైకోర్టు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్. తప్పనిసరి పరిస్థితులలో మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయంలో హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని హెచ్చరించిన ఉమెన్ కమిషన్.





