Mahaa Daily Exclusive

  ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్-2025 గెలిచిన భార‌త జ‌ట్టు స‌భ్యుల్లో ఆదిలాబాద్ త‌పాల ఉద్యోగి …!

Share

సోమ‌వారం ఖోఖో ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో న్యూ ఢిల్లీలో భార‌త్ , నేపాల్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన అంత‌ర్జాతీయ ఖోఖో ఫైన‌ల్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ సొంతం చేసుకున్న భార‌త జ‌ట్టులో ఆదిలాబాద్ త‌పాల ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌పాల స‌హాయ‌కుడిగా ప‌ని చేస్తున్న శివారెడ్డి అటాక‌ర్ గా ప్రాతినిధ్యం వ‌హించారు. మొత్తం 21 దేశాలు పాల్గొన్న పోటీల‌లో భార‌త్ ట్రోఫీ గెలుచుకుంది. శివారెడ్డి బెస్ట్ అటాక‌ర్ గా గుర్తింపు పొందారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని బాప‌ట్ల జిల్లా పంగ‌లూరులో ఎస్ ఆర్ ఆర్ ఖోఖో అకాడ‌మీ లో శిక్ష‌ణ పొందిన ఆయ‌న‌ 2022 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందారు.2018లో సీనియ‌ర్ స్టేట్ మెంట్ ట్రోఫీతో త‌న విజయ‌ ప్ర‌స్థానం ప్రారంభించి ఇప్ప‌టి వ‌ర‌కు 34 జాతీయ‌, 1 అంత‌ర్జాతీయ ప‌త‌కాలే కాకుండా 3 బంగారు, 4 వెండి, 8 కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్నారు.జిల్లా అధికారులు, స‌హోద్యోగులు, జిల్లా వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Latest