Mahaa Daily Exclusive

  వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దేశమంతా దోచుకుంటున్నారు తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

Share

తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుందేది అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదని, వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా దారుస్సలంకి వెళ్తుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం వక్ఫ్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ కు బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదని, వక్ఫ్ బోర్డు దగ్గర ఎంత భూమి ఉందో చెప్పరని మండిపడ్డారు. డాక్యు మెంట్ లు వాళ్ళ నాయకుల ఇళ్ళల్లో ఉంటాయన్నారు. కొత్త చట్టం వల్ల రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతుందని స్పష్టం చేశారు. భూముల వివరాలు మొత్తం డిజిటలైజ్ చేస్తామన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంత మంది పేదలకు న్యాయం చేశారో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు చెప్పాలని సవాల్ విసిరారు. వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింలలోని ఒక్క పేద కుటుంబానికి ఇంచత వరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. కొత్త సవరణ చట్టం ద్వారా పూర్తిగా పేద ముస్లింలకు మేలు జరుగుతుందన్నారు. అందుకే వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింలలోని పేదలెవరూ వ్యతిరేకించడం లేదని, కేవలం వక్ఫ్ ఆస్తులను ఇంతకాలం దోచుకుంటున్న వారే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.