ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. దగదర్తి (నెల్లూరు జిల్లా), కుప్పం (చిత్తూరు జిల్లా), మూలపేట (శ్రీకాకుళం జిల్లా)లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని చెప్పారు. కేంద్రంలోనూ ఎన్డీయే, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని పురందేశ్వరి పేర్కొన్నారు. అభివృద్ధి ద్వారా అనుసంధానత పెరగడమే కాదు, ఆర్థిక పురోగతి కూడా సాధ్యమవుతుందని వివరించారు.
Post Views: 6