Mahaa Daily Exclusive

  జమిలి ఎన్నికలపై బిగ్ ట్విస్ట్..

Share

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. ఎన్డీఏ నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. ఎన్డీఏ మిత్ర పక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు తెలుపగా.. కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటికి అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు జమిలి ఎన్నికలకు తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశిథరూర్ స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఓటింగ్‌లో బీజేపీకి రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మంగళవారం ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

ఈ బిల్లును మేము (కాంగ్రెస్) మాత్రమే వ్యతిరేకించలేదు. మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందా? ఇది ఎలా సాధ్యమని బీజేపీ కూటమిని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను ఇలా మార్చడంలో అర్థం లేదని ఆయన అన్నారు, ఎందుకంటే కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో రాబోయే ప్రభుత్వం మెజారిటీ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు అది మళ్లీ అదే గందరగోళానికి దారి తీస్తుందని ఆయన వివరించారు.

 

ఏది ఏమైనప్పటికీ, రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ బీజేపీకి లేదని ఈ రోజు ఓట్లు నిరూపించాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ అన్నారు. మరోవైపు సొంత ఎంపీలు సైతం బీజేపీకి షాకిచ్చారు.

 

లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు. గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.