గత ప్రభుత్వ హయాంలో ఏపీ అసెంబ్లీ గేట్-2 నుంచి ప్రవేశాలను నిషేధిస్తూ నిర్మించిన అడ్డుగోడను నేడు తొలగించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గేట్-2ని తెరిపించారు. నాడు అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాసౌమ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో ఈ గేటు-2ని మూసివేసి, గోడ కట్టించారు. నేడు సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో గేట్-2కి అడ్డుగా కట్టిన గోడను తొలగించారు. తద్వారా ఈ గేటు నుంచి ప్రవేశాలకు మార్గం సుగమం చేశారు.
Post Views: 13