Mahaa Daily Exclusive

  నాని సరసన జాన్వీ..

Share

జాన్వీ కపూర్‌కి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న ఆమె, తదుపరి రామ్‌చరణ్‌ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆమె నాని సరసన నటించనుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘దసరా’ తర్వాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులోనే జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించనుంది.