Mahaa Daily Exclusive

  పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

Share

చిన్న పిల్లలకు ఏవైనా గింజలు తింటే కడుపులో మొక్కలు వస్తాయని చెబుతుంటారు. వామ్మో కడుపులో చెట్లు అవుతాయట ఈ గింజలు తినవద్దు అని ఏవైనా ఉమ్మేస్తుంటారు చిన్నపిల్లలు.

వారే కాదు పెద్దవారు కూడా చాలా గింజలను తినరు. అయితే పుచ్చకాయ గింజలను కూడా ఇలాగే ఉమ్మేస్తారు. కానీ వీటివల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఓ సారి లుక్ వేసేయండి.

పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. సో బరువు పెరుగుతారు అనే భయం అక్కర్లేదు. అంతేకాదు ఇందులో శరీరానికి అవసరం అయ్యే రాగి, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు పోషకాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ పుచ్చకాయ వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుందట.

గుండెకు నేరుగా అనుసంధానం అవుతుంది కాబట్టి గుండె ఆరోగ్యం కూడా పదిలం అవుతుంది. ఇక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఖనిజ పోషకాలు ఎముకల శక్తికి మంచి బలాన్ని ఇస్తాయి. శరీర పెరుగుదల, మార్పులను నియంత్రించడంలో సహాయం చేస్తాయి పుచ్చకాయ గింజలు. శరీరంలో విడుదలయ్యే యాసిడ్ లను నియంత్రిస్తాయట. మధుమేహం ఉన్నవారికి మరింత ఉపయోగం ఇవి. ఈ గింజలను ఎండలో ఎండబెట్టి ఫ్రై చేసుకొని కూడా తినవచ్చట.

పుచ్చకాయ గింజల నుంచి బర్పీలను కూడా తయారు చేస్తారు. బెల్లం వేసి లడ్డూలా చేసుకుంటారు. అంతేకాదు పొడి చేసి కూడా తింటారు కొందరు. విత్తనాలను మెత్తగా చేసి షేక్ ను చేసుకోవచ్చు. అందేకాదు వెన్న కూడా తయారు చేసుకోవచ్చట. ఆరోగ్యం మాత్రమే కాదు ఈ గింజల వల్ల చర్మానికి కూడా సంరక్షణ అందుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ గింజల నూనె కూడా లభిస్తుంటుంది. చర్మంపై రుద్ది మసాజ్ చేస్తే కొన్ని చర్మ సమస్యలు తొలుగుతాయట. జట్టు కు రాస్తే జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది.