వరంగల్ మహా;
భారత సైన్యం ప్రాణాలను లెక్కచేయకుండా పాకిస్తాన్ పై వీరోచితంగా పోరాడి సాధించిన విజయానికి, ఈ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందని రాష్ట్ర బిజెపి సీనియర్ నేత గందె నవీన్ కుమార్ అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కేవలం ఒక జ్ఞాపకం కాదని, 1999లో దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శించిన అజేయ ధైర్యం, అత్యున్నత త్యాగాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. లడఖ్ మంచు శిఖరాల పై అసాధారణమైన పరిస్థితులను అధిగమిస్తూ పోరాడి, భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన భారత సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించాలన్నారు. వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ బాధిత సైనిక కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన గుర్తు చేశారు.







